తండ్రి ట్విట్టర్లో తనయుడి టీజర్ రిలీజ్
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని అఖిల్ బుధవారం (ఏప్రిల్ 8) ) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న టీజర్ను హీరో నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. 'హ్యాపీ 21 బర్త్డే మై డియర్ సన్. మే యువర్ గ్రాండ్ ఫాదర్ గైడ్ యూ అండ్ బ్లెస్ యూ. వియ్ లవ్ యూ!!!' అంటూ నాగార్జున ట్విట్ చేశారు. ట్విట్టర్ లో పెట్టిన ఫోటోలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల నవ్వుతూ ఫోజ్ ఇచ్చారు.
ఇక హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్ ...అక్కినేని అభిమానులకు అఖిల్ ఫస్ట్లుక్ టీజర్ గిఫ్టు ఇచ్చారు. టీజర్ విడుదల చేసిన వెంటనే అక్కినేని అభిమానులు, నితిన్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ నెట్వర్క్లో అఖిల్ టీజర్ హల్చల్ చేస్తోంది. ఇక అక్కినేని కుటుంబంలోని మూడుతరాల వాళ్లందరూ కలిసి నటించిన 'మనం' చిత్రంలో అఖిల్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఇక పూర్తి స్థాయి హీరోగా మాత్రం అఖిల్కి ఇది తొలి చిత్రం.
happy 21st birthday my dear son @AkhilAkkineni8 ..may your grandfather guide you and bless u. We love you!!! pic.twitter.com/viuQgEu54o
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 7, 2015
Great start on your bday !!@AkhilAkkineni8 I love the energy and confidence http://t.co/nudHl2HJee
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 8, 2015