
డిసెంబర్ తొలి వారంలో అఖిల్ సినిమా
తొలి సినిమా అఖిల్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అక్కినేని నట వారసుడు, తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు ఈ యంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ల నుంచి కుర్ర దర్శకుల వరకు అందరినీ ట్రై చేసి ఫైనల్ గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
ఇప్పటికే ఈ సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులవుతున్నా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలో అఖిల్ రెండో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ తరువాత అఖిల్ నిశ్చితార్థ కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అఖిల్ వివాహం కన్నా ముందే రెండో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.