నవంబర్లో అఖిల్ రీ లాంచ్..? | Akhil Second Film Launch In Grand Event | Sakshi
Sakshi News home page

నవంబర్లో అఖిల్ రీ లాంచ్..?

Published Sun, Sep 11 2016 1:23 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నవంబర్లో అఖిల్ రీ లాంచ్..? - Sakshi

నవంబర్లో అఖిల్ రీ లాంచ్..?

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. భారీ హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరోను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అక్కినేని అందగాడు, ఇప్పుడు తన రీ లాంచ్కు భారీ ప్రణాళికలు వేస్తున్నాడట.

అఖిల్ తొలి సినిమా విషయంలో పెద్దగా కలుగజేసుకోని నాగార్జున, రెండో సినిమాను మాత్రం అంతా తానై నడిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించిన అక్కినేని కుటుంబం, ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement