
అఖిల్ కొత్త సినిమా.. కొత్త ఏడాదిలోనే..
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ రెండో సినిమా కోసం అభిమానులు మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందేనట. తొలి సినిమా అఖిల్తో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి ఎన్నో యంగ్ డైరెక్టర్ వరకు చాలా మందిని సంప్రదించిన తరువాత ఫైనల్గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ఫైనల్ చేశాడు.
కింగ్ నాగార్జున కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటూ అఫీషియల్ గా ప్రకటించినా.. ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లడానికి మాత్రం మరింత సమయం పట్టనుందట. ప్రస్తుతం కథకు తుదిమెరుగులు దిద్దుతున్న విక్రమ్, మరో మూడు నెలల పాటు స్క్రీప్ట్ మీదే వర్క్ చేయనున్నాడు. దీంతో అఖిల్ సినిమా ఈ ఏడాదిలో మొదలయ్యే అవకాశం కనిపించటం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2017 జనవరిలో సినిమాను ప్రారంబించాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని టీం.