ఆ రీమేక్ మీద మనసుపడ్డాడా? | akkineni akhil planing to remake ye jawani hai diwani | Sakshi
Sakshi News home page

ఆ రీమేక్ మీద మనసుపడ్డాడా?

Jan 5 2016 8:34 AM | Updated on Sep 3 2017 3:08 PM

ఆ రీమేక్ మీద మనసుపడ్డాడా?

ఆ రీమేక్ మీద మనసుపడ్డాడా?

భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసి.., ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన స్టార్ వారసుడు అఖిల్. అక్కినేని నట వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సిసింద్రీ.. తొలి సినిమాతో నటుడిగా మంచి...

భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసి.., ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన స్టార్ వారసుడు అఖిల్. అక్కినేని నట వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సిసింద్రీ.. తొలి సినిమా 'అఖిల్'తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో రెండో సినిమా విషయంలో డైలామాలో పడ్డాడు. అఖిల్ సినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా, ఇంతవరకు తన రెండో సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

యాక్షన్ ఇమేజ్తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్, రెండో సినిమా కోసం ఏ జానర్ ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో సేఫ్ గేమ్ ఆడేందుకు సిద్ధపడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'యే జవానీ హై దివానీ' సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవచ్చ ప్లాన్ చేస్తున్నాడు అఖిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement