హలో గురూ ప్రేమ కోసమే | Akkineni akhil new movie is hallo guru prema kosame titel confermed. | Sakshi
Sakshi News home page

హలో గురూ ప్రేమ కోసమే

Published Wed, Jun 21 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

హలో గురూ ప్రేమ కోసమే

హలో గురూ ప్రేమ కోసమే

జున్ను లేదు... బన్ను లేదు... అఖిల్‌ రెండో సినిమాకు ‘హలో గురూ ప్రేమ కోసమే’ టైటిల్‌ను ఆల్మోస్ట్‌ కన్ఫర్మ్‌ చేసినట్లేనని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జనాలు చెప్పుకుంటున్నారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా అక్కినేని నాగార్జున ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ బేస్డ్‌ ఎంటర్‌టైనర్‌కు ‘జున్ను’తో పాటు పలు టైటిల్స్‌ వినిపించాయి. చివరకు, అఖిల్‌ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’లో సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘హలో గురూ ప్రేమ కోసమే..’లో పల్లవినే టైటిల్‌గా కన్ఫర్మ్‌ చేశారట! త్వరలో ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు కానుంది. అందులో రొమాంటిక్‌ సీన్స్‌ తీస్తారట. ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరోపై ఫైట్స్‌ తీశారు. ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఎనౌన్స్‌ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement