క్రిష్ దర్శకత్వంలో అఖిల్..? | akkineni akhil second film with krish | Sakshi
Sakshi News home page

క్రిష్ దర్శకత్వంలో అఖిల్..?

Published Tue, Nov 17 2015 12:32 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

క్రిష్ దర్శకత్వంలో అఖిల్..? - Sakshi

క్రిష్ దర్శకత్వంలో అఖిల్..?

తొలి సినిమా రిలీజ్కు ముందే స్టార్ స్టేటస్ అందుకున్న యంగ్ హీరో అఖిల్.. ఆ సినిమా రిజల్ట్తో సంబందం లేకుండా తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'అఖిల్' సినిమాకు డివైడ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్ను కాదని, ఓ ప్రయోగాత్మక దర్శకుడిని తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

తొలి సినిమా రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే హీరోగా అఖిల్ మాత్రం మంచి మార్కులే సాధించాడు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్ల విషయంలో యంగ్ హీరోస్కు షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు. నెక్ట్స్ సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు అఖిల్. అందుకే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.

కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ కూడా సాధించిన క్రిష్, అఖిల్ సినిమాకు తన మార్క్ కథను రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, 2016 ప్రథమార్థంలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను అక్కినేని ఫ్యామిలీ ఆస్థాన నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement