
అఖిల్ అక్కినేని..

ఇప్పుడంట్లే ఫ్లాపులతో సతమతమవుతున్నాడు కానీ..

తను ఎప్పుడో నెం.1 అనిపించుకున్నాడు.

అదెలాగంటారా? అఖిల్ పసిపిల్లాడుగా ఉన్నప్పుడే తన తండ్రి నాగార్జున నటించిన సిసింద్రీ మూవీలో కనిపించాడు.

పాలబుగ్గలా పిల్లాడుగా నవ్వుతూ, ఏడుస్తూ, అందరినీ ముప్పుతిప్పలు పెట్టించాడు.

అలా తొలి సినిమాతోనే అఖిల్ అందరికీ తెగ నచ్చేశాడు.

ఈ మూవీ చూసిన అక్కినేని ఫ్యాన్స్.. అఖిల్ ఎప్పటికైనా నెం.1 అవుతాడని ఆశించారు.

అఖిల్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు.

తొలి మూవీతోనే హిట్టందుకున్నాడు.

కానీ తర్వాతే.. ఏం చేసినా అచ్చిరావడం లేదు.

అయినా సరే అయ్యగారే నెం.1 అని.. ఎప్పటికైనా పెద్ద హిట్ కొడతాడంటున్నారు ఫ్యాన్స్.











