
తమిళ స్టార్ హీరో విజయ్ అసలు పేరు విజయ్ జోసెఫ్. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు. దీంతో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ వాతావరణంలోనే పెరిగాడు.

1984-88 మధ్య ఆరు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా విజయ్ నటించాడు.

1992 నుంచి హీరోగా మారి వరస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

2012లో 'స్నేహితుడు' మూవీ నుంచి తెలుగు ప్రేక్షకులకు అలవాటైపోయాడు.

ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది.

ఇకపోతే తెలుగులో పలువురు నెటిజన్లు.. విజయ్‌ని పెద్ద కారణం లేకుండానే ట్రోల్ చేస్తుంటారు.

విజయ్ గతంలో తెలుగు సినిమాల రీమేక్స్ చేశాడు. వీటిలో సీన్స్ కాస్త ఎబ్బెట్టుగా ఉండటమే ట్రోల్స్‌కి ఓ కారణం!

కొన్నాళ్ల క్రితం 'తమిళ వెట్రి కళగం' అనే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.






















