అఖిల్ ఇంట్రస్టింగ్ ట్వీట్ : 'వీడెవడు' | Akkineni Akhil intresting tweet | Sakshi
Sakshi News home page

అఖిల్ ఇంట్రస్టింగ్ ట్వీట్ : 'వీడెవడు'

Published Tue, Feb 7 2017 12:24 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

అఖిల్ ఇంట్రస్టింగ్ ట్వీట్ : 'వీడెవడు'

అఖిల్ ఇంట్రస్టింగ్ ట్వీట్ : 'వీడెవడు'

సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉండే అక్కినేని నటవారసుడు అఖిల్, మంగళవారం ఉదయం ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు. ఓ మూవీ పోస్టర్ను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేసిన అఖిల్, ఆ హీరో ఎవరో గెస్ చేయండి అంటూ అభిమానులకు క్వశ్చన్ వేశాడు. వీడెవడు అనే టైటిల్తో ఉన్న ఈ పోస్టర్లో ఓ వ్యక్తి.., చేతిలో గన్తో వెనుక నుంచి కనిపిస్తున్నాడు. పోస్టర్ మొత్తం కిల్లర్, లూజర్, విలన్, గ్యాంబ్లర్, హీరో, ఫైటర్ లాంటి పదాలు గజిబిజీగా రాసి ఉన్నాయి.

ఈ ఫోటోను ట్వీట్ చేసిన అఖిల్ అతనెవరో కనుకునేందుకు హింట్ కూడా ఇచ్చాడు. అతను నా టీంమెట్ అంటూ క్లూ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన అఖిల్, ఆ సినిమా కోసం నితిన్తో కలిసి పనిచేశాడు. అఖిల్ తొలి సినిమాకు నితిన్ నిర్మాత. దీంతో అఖిల్ చెప్పిన టీంమెట్ నితిన్ అయి ఉంటాడంటున్నారు ఫ్యాన్స్.

నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓల్డ్ సిటీ కుర్రాడిగా రఫ్ లుక్లో కనిపించనున్నాడు నితిన్. సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.  మరి అఖిల్ రిలీజ్ చేసిన ఈ ప్రీ లుక్ నితిన్ సినిమాకు సంబంధించినదేనా.. లేక ఇంకెవరిదోనా..? తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement