Dil Raju Locks Superstar Rajinikanth For His Next Tamil Project - Sakshi
Sakshi News home page

క్రేజీ బజ్.. రజనీకాంత్‌తో ‘దిల్‌’ రాజు సినిమా?

Published Wed, Apr 12 2023 8:47 AM | Last Updated on Wed, Apr 12 2023 9:30 AM

Dil Raju Locks Rajinikanth For His Next Tamil Project - Sakshi

ఇటీవల తమిళ హీరో విజయ్‌తో ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు’) సినిమా నిర్మించారు ‘దిల్‌’ రాజు. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ‘దిల్‌’ రాజు ఓ సినిమాను పట్టాలెక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పూర్తి స్క్రిప్ట్‌ పూర్తయ్యాక రజనీకాంత్‌ను కలిసి కథ వినిపించాలని ‘దిల్‌’ రాజు భావిస్తున్నారట.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పనులను దర్శకుడు వంశీ పైడిపల్లికి ‘దిల్‌’ రాజు అప్పజెప్పారని, ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నది వంశీయే అనే టాక్‌ వినిపిస్తోంది. మరి.. రజనీకాంత్, ‘దిల్‌’ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని సినిమా నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం ‘జైలర్‌’ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్‌. అలాగే ‘లాల్‌ సలామ్‌’లో ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రాలు కాకుండా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో రజనీ ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement