
రిషి ప్రయాణం చివరి స్టాప్‌కు వచ్చేసింది. ఈ జర్నీలో ఏం కనుక్కున్నాడో, తెలుసుకున్నాడో మనందరికీ మే9న తెరపై చూపించనున్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. రిషి పాత్రలో మహేశ్ కనిపిస్తారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు.
పూజా హెగ్డే కథానాయిక. ‘మహర్షి’ టాకీ పార్ట్ చివరిదశకు వచ్చేసిందని సమాచారం. రెండు పాటలు మినహా నేటితో చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన రెండు పాటల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో, రెండో పాటను దుబాయ్‌లో షూట్ చేస్తారని సమాచారం. ‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కెమెరా: కె.యు.మోహనన్.
Comments
Please login to add a commentAdd a comment