
అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన అఖిల్ తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా చేసిన హలో పరవాలేదనిపించినా తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో అఖిల్ మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది. అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా టీజర్‌ను కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేకపోయినా.. అఖిల్ 3 టీజర్‌తో నాగ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్, అఖిల్ లుక్‌తో పాటు సాంగ్ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నాగ్‌కు అక్కినేని వారసుడు ఇచ్చే గిఫ్ట్‌తో అభిమానులు కూడా పండగ చేసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment