యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కిర్తి సురేష్ జంటగానటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ వెడ్డింగ్ సందర్భంగా ‘రంగ్ దే` నుంచి విడుదల చేసిన చిన్న వీడియోకి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది.
`ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది’ అంటూ సాగే ఈ మెలోడీ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్ కపిలన్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చాలా నెమ్మదిగా సాగే ఈ మెలోడీ సాంగ్‌ని వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా చిత్రీకరించనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో డీఎస్పీ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
(చదండి : ఫ్రెండ్స్‌తో స్టెప్పులేసిన స్టార్ హీరో కూతురు)
‘రంగ్‌దే’ నుంచి ఫస్ట్ సాంగ్.. మెలోడీతో కట్టిపడేసిన డీఎస్పీ
Published Thu, Nov 12 2020 8:16 PM | Last Updated on Thu, Nov 12 2020 8:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment