ప్రేమికుల రోజున ‘మిస్టర్‌ మజ్ను’ | Akhil Akkineni Mr Majnu To Be Postponed | Sakshi
Sakshi News home page

Oct 9 2018 12:57 PM | Updated on Oct 9 2018 12:57 PM

Akhil Akkineni Mr Majnu To Be Postponed - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా మిస్టర్‌ మజ్ను. తొలి ప్రేమ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సక్సెస్‌ ఫుల్ నిర్మాత బీవీయస్‌ఎన్‌ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల లండన్‌లో మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సినిమాను అక్కినేని లక్కీ మంత్‌ డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో వరున్‌ తేజ్‌ ‘అంతరిక్షం’, శర్వానంద్‌ ‘పడి పడి లేచే మనసు’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో మిస్టర్‌ మజ్నును వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కావటంతో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తే బెటర్‌ అని భావిస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అఫీషియల్‌ రిలీజ్ డేట్‌ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement