
అక్కినేని నటవారసుడు అఖిల్ నటుడిగా ఆకట్టుకుంటున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. తొలి సినిమా ‘అఖిల్’తో తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా హలోతో పరవాలేదనిపించాడు. కానీ మరోసారి మూడో సినిమా మిస్టర్ మజ్నుతో తడబడ్డాడు అఖిల్. దీంతో అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడన్న ఆసక్తినెలకొంది. అఖిల్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్స్ లిస్ట్ లో శ్రీనువైట్ల, క్రిష్ లాంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.
అఖిల్ మాత్రం మరోసారి డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అఖిల్ మాత్రం తన తదుపరి చిత్రంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.