
తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌ను కొందరు వర్కర్స్‌గానే చూస్తే.. మరికొంత మంది సొంతింటి మనుషులుగా చూస్తారు. వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా హాజరవుతుంటారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తన వద్ద పనిచేస్తున్న వ్యక్తి వివాహానికి హాజరయ్యారు.
అక్కినేని ఫ్యామిలీ తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌ని బాగా చూసుకుంటారన్న విషయం తెలిసిందే. అఖిల్ అక్కినేని పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి అఖిల్ అక్కినేని స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. మిస్టర్ మజ్ను షూటింగ్‌లో బిజీగా ఉన్న అఖిల్ ఈ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment