లవర్‌బాయ్‌ ఆఫ్‌ ది ఇయర్‌! | Akhil new year poster from mister majnu movie | Sakshi
Sakshi News home page

లవర్‌బాయ్‌ ఆఫ్‌ ది ఇయర్‌!

Published Wed, Jan 2 2019 12:19 AM | Last Updated on Wed, Jan 2 2019 12:19 AM

Akhil new year poster from mister majnu movie - Sakshi

ప్రేమలో పీహేచ్‌డీ చేయాలనుకునే కొందరు లవర్‌బాయ్స్‌ కూడా ఓ మంచి అందమైన అమ్మాయికి ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి అమ్మాయితో ప్రేమలో పడ్డ ఓ లవర్‌బాయ్‌ కథతో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్‌ మజ్ను’. తొలిప్రేమ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్నారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, ‘ఏమైనదో.. ఏమైనదో’, ‘మిస్టర్‌. మజ్ను’ సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.

ఇప్పుడు న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నాం. లవర్‌ బాయ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ‘మిస్టర్‌ మజ్నుని’ కలుసుకోండి. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, ‘హైపర్‌’ ఆది ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement