వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుంది: నిర్మాత నాగవంశీ | Unstoppable S4 Episode 2 Promo Lucky Bhaskar Team | Sakshi
Sakshi News home page

Unstoppable Promo: 'లక్కీ భాస్కర్' టీమ్‌తో బాలకృష్ణ ఫన్నీ ముచ్చట్లు

Published Tue, Oct 29 2024 5:31 PM | Last Updated on Tue, Oct 29 2024 5:38 PM

Unstoppable S4 Episode 2 Promo Lucky Bhaskar Team

'సీతారామం' సినిమా దెబ్బకు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నారు. ఇదివరకే షూటింగ్ పూర్తవగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.

గతవారమే 'అన్‪‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలైంది. తొలి ఎపిసోడ్‌కి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్‌లో 'లక్కీ భాస్కర్' హీరోహీరోయిన్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కనిపించారు.

(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్‌ప్రైజ్)

కారు డ్రైవింగ్ స్పీడ్ గురించి బాలకృష్ణ.. 300 కిమీ వేగంతో నడుపుతానని దుల్కర్ చెప్పాడు. అలానే మాటల సందర్భంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకీ అట్లూరికి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. అలానే దిల్ రాజు.. చాలాసార్లు పింక్ ప్యాంట్ వేసుకుని వస్తున్నారని, అది వద్దని చెప్పాలనుందని నాగవంశీ అన్నారు.

సినిమా సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే తెలుగు హీరో గురించి బాలకృష్ణ-నాగవంశీ మధ్య చర్చ జరిగింది. ఆ హీరో పేరు ఏంటనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ప్రోమో చూస్తుంటే సరదాగానే అనిపించింది. ఎపిసోడ్ కూడా ఇలానే ఉంటే మంచి ఫన్ గ్యారంటీ.

(ఇదీ చదవండి: హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement