
అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్‌లతో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. మరోవైపు తొలిప్రేమ లాంటి ప్రేమ కథను తీసి తొలిప్రయత్నంలోనే డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశాడు వెంకీ అట్లూరి. అయితే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి మిస్టర్ మజ్నుతో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీ తరువాత విజయ్‌తో ఓ సినిమాను చేసే అవకాశమున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తరువాత మరో రెండు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టినా.. ఏది మొదలవుతుందో ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. డియర్ కామ్రేడ్ తరువాత వెంకీ అట్లూరితోనే సినిమా ఉండే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.