దీపావళి సందర్భంగా 'లక్కీ భాస్కర్' సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఈసారి లక్కీ భాస్కర్‌తో అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్‌లో తన సత్తా నిరూపించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది.
కథేంటి?
ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment