
అఖిల్, నిధీ అగర్వాల్ ఇద్దరి ముందు తాగడానికి రెడీగా డ్రింక్, ఫుడ్ ఉన్నాయి. చేతిలో స్పూన్ ఉంది. కానీ వారిద్దరి కళ్లు మాత్రం ఫోన్‌పై ఉన్నాయి. అంతలా ఫోన్ స్క్రీన్ చూస్తున్నారు అంటే అదేదో ఇంపార్టెంట్ మేసేజ్ అనుకోవచ్చా. అది లవ్ మేసేజేనా? ఏమో సినిమా చూస్తే కానీ అర్థం కాదీ సీన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ‘‘ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది.
ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నాం. జనవరి 25న సినిమాను రిలీజ్ చేయబోతున్నాం’’ అని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. ‘‘న్యూ ఇయర్‌ను ఈ సినిమాతో స్టార్ట్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అఖిల్. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment