Swayambhu: హనుమాన్‌ భక్తుడిగా నిఖిల్‌! | Nikhil As Hanuman Devotee In Swayambhu Movie | Sakshi
Sakshi News home page

Swayambhu: హనుమాన్‌ భక్తుడిగా నిఖిల్‌!

Published Wed, Jan 17 2024 10:22 AM | Last Updated on Wed, Jan 17 2024 10:39 AM

Nikhil As Hanuman Devotee In Swayambhu Movie - Sakshi

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్‌ ‘స్వయంభూ’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు.‘స్వయంభూ’ సినిమా అప్‌డేట్‌ను షేర్‌ చేశారు నిఖిల్‌.

‘‘నాన్‌స్టాప్‌గా మా సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్‌ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరెట్‌ డైలాగ్‌ జై శ్రీరామ్‌. అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాం. దసరా లేదా దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు నిఖిల్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement