'నా జీవితమంతా సాహసాలే'.. ఆ సినిమా కోసం మరో డేరింగ్ చేస్తోన్న హీరోయిన్! | Bimbisara Fame Samyuktha Menon Shares Horse Riding Pic With Emotional Post Goes Viral - Sakshi
Sakshi News home page

Samyuktha Menon: 'అలాంటివేమీ నాకు అడ్డంకి కాదు': సంయుక్త మీనన్

Published Sun, Feb 11 2024 4:37 PM | Last Updated on Sun, Feb 11 2024 5:51 PM

Bimbisara Fame Samyuktha Menon Shares Horse Riding Post Goes Viral - Sakshi

భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది విరూపాక్ష, డెవిల్‌ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ధనుశ్ సరసన సార్ చిత్రంలోనూ మెరిసింది. వరుసగా అవకాశాలతో సూపర్ హిట్స్ కొడుతోంది. తాజాగా ఈ బింబిసార ఫేమ్ యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఓ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. 

తాజాగా ఈ కేరళ భామ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది. అంతే కాకుండా సుదీర్ఘమైన సందేశం కూడా రాసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. నా జీవితమంతా ఎల్లప్పుడూ సాహసాలతోనే కొనసాగుతోందని.. తాను ఎప్పటికీ కంఫర్ట్‌ జోన్‌లో ఉండేందుకు ఇష్టపడనని వెల్లడించింది. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది. నా నెక్ట్స్ మూవీ స్వయంభూ కోసమే ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని రాసుకొచ్చింది ముద్దుగుమ్మ. 

సంయుక్త ట్వీట్‌లో రాస్తూ.. 'ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితమంతా సాహసాలతోనే నడుస్తోంది. కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవడాన్ని ఇష్టపడను. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. ఇది నాకు కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. ఇది నాకు లభించిన అదృష్టం కూడా.  ఇది ఒక ఆధ్యాత్మిక, సుసంపన్నమైన ప్రయాణం. గుర్రంతో సామరస్యంగా ఉంటూ.. గుర్రం మనసును దగ్గర నుంచి పరిశీలించడం.. మేమంతా ఒక టీమ్‌గా కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని ఒక మెట్టుగా మలచుకుంటున్నా. అలాంటివేమీ నా జీవితంలో అడ్డంకి కాదు.'  అంటూ పోస్ట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement