గూఢచారి 111 | Vennela Kishore plays a spy in 'Chaari 111' movie - Sakshi
Sakshi News home page

గూఢచారి 111

Published Thu, Aug 24 2023 12:21 AM | Last Updated on Thu, Aug 24 2023 11:01 AM

Vennela Kishore plays a spy in Chaari 111 Movie - Sakshi

‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్‌ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్‌ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్‌ టీజర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్‌ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్‌ కూడా ఉంటుంది. స్టైలిష్‌ యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్‌లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. షూటింగ్‌ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement