Chaari 111: గూఢచారిగా 'వెన్నెల' కిశోర్..నవ్వులు పూయిస్తున్న ట్రైలర్‌ | 'Chaari 111' Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Chaari 111: గూఢచారిగా 'వెన్నెల' కిశోర్..నవ్వులు పూయిస్తున్న ట్రైలర్‌

Published Mon, Feb 12 2024 1:58 PM | Last Updated on Mon, Feb 12 2024 3:23 PM

Chaari 111 Movie Trailer Out - Sakshi

'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు.  మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 

ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో 'చారి 111' ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

సీరియస్‌గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించనున్నారు. ఈ 'చారి 111' ట్రైలర్ చివరలో 'వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా' అంటూ 'కెజియఫ్'లో రాకీ భాయ్ టైపులో 'వెన్నెల' కిశోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. 'నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు' అంటూ 'వెన్నెల'  కిశోర్ మీద పంచ్ కూడా వేశారు. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement