కొన్ని సినిమాలు అనుకున్న రీతిలో ఆడవు. అయితే థియేటర్‌లో నష్టపోయినా ఓటీటీ బిజినెస్ ద్వారా చాలా చిత్రాలు గట్టెక్కుతున్నాయి. పైగా కొన్ని బాక్సాఫీస్ ప్రియులకు నచ్చకపోయినా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో క్లిక్ అవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ప్రకటనలతో ఓటీటీలోకి వచ్చేస్తుండగా మరికొన్ని చడీచప్పుడు లేకుండా డైరెక్ట్‌గా రిలీజవుతున్నాయి. అలా వెన్నెల కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ మూవీ చారి 111 మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఓటీటీలో స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మురళీ శర్మ కీలక పాత్రలో నటించాడు. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించగా అదితి సోని నిర్మించారు. సైమన్ కె.కింగ్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్‌ను అటకెక్కించినట్లు తెలుస్తోంది.
కథేంటంటే..
హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో మానవ బాంబు పేలుడు జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు లభించవు. ఇది ఉగ్రవాదుల పని అని.. వారి ప్లానేంటో కనుక్కోవాలని ముఖ్యమంత్రి రాహుల్ రవీంద్రన్ సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు. రుద్రనేత్ర ఏజెన్సీలో చారి (వెన్నెల కిశోర్)కి బాంబు పేలుడు కేసు అప్పగిస్తాడు. ఈ ఆత్మాహుతి దాడిని చారి పరిష్కరించాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
Get ready for a hilarious rollercoaster ride with #CHAARI111, now streaming on @PrimeVideoIN! 🕵️♂️💼 Don't miss out on the fun-filled espionage adventure!
— Divo (@divomovies) April 5, 2024
🔗 https://t.co/OAcSJasE2u#Vennelakishore @samyukthavv@barkatstudios @aditisoni1111 @tgkeerthikumar pic.twitter.com/BpStl2jB6B
Comments
Please login to add a commentAdd a comment