Chaari 111 Movie
-
ఓటీటీలో దూసుకెళ్తున్న వెన్నెల కిశోర్ సినిమా
కొన్ని సినిమాలు థియేటర్స్‌లో సరిగా ఆడకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది బాగా జరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఓటీటీల్లో మాత్రం ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చారి 111 సినిమా విషయంలోనూ అదే జరిగింది. కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్‌లో విడుదలై పర్వాలేదనిపించుకుంది. సంయుక్త విశ్వనాథన్ గ్లామర్‌తో పాటు మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేశ్‌ల కామెడీకి మంచి మార్కులే పడినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేపోయింది. దీంతో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చి నెల రోజులైనా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. కామెడీ జోనర్లో ఈ చిత్రం టాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద హీరోల సినిమాలను మించి ‘చారి 111’ సుమారు 70 మిలియన్స్ కి పైగా వ్యూస్ మినిట్స్ సాధించడం గమనార్హం. ఓటీటీలో వస్తున్న ఆదరణ పట్ల నిర్మాత అదితి సోని ఆనందం వ్యక్తం చేశారు. ‘చారి 111’ కథేంటి?హైదరాబాద్‌లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ మూవీ
కొన్ని సినిమాలు అనుకున్న రీతిలో ఆడవు. అయితే థియేటర్లో నష్టపోయినా ఓటీటీ బిజినెస్ ద్వారా చాలా చిత్రాలు గట్టెక్కుతున్నాయి. పైగా కొన్ని బాక్సాఫీస్ ప్రియులకు నచ్చకపోయినా డిజిటల్ ప్లాట్ఫామ్లో క్లిక్ అవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ప్రకటనలతో ఓటీటీలోకి వచ్చేస్తుండగా మరికొన్ని చడీచప్పుడు లేకుండా డైరెక్ట్‌గా రిలీజవుతున్నాయి. అలా వెన్నెల కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ మూవీ చారి 111 మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మురళీ శర్మ కీలక పాత్రలో నటించాడు. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించగా అదితి సోని నిర్మించారు. సైమన్ కె.కింగ్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్‌ను అటకెక్కించినట్లు తెలుస్తోంది. కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ మాల్లో మానవ బాంబు పేలుడు జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు లభించవు. ఇది ఉగ్రవాదుల పని అని.. వారి ప్లానేంటో కనుక్కోవాలని ముఖ్యమంత్రి రాహుల్ రవీంద్రన్ సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు. రుద్రనేత్ర ఏజెన్సీలో చారి (వెన్నెల కిశోర్)కి బాంబు పేలుడు కేసు అప్పగిస్తాడు. ఈ ఆత్మాహుతి దాడిని చారి పరిష్కరించాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! Get ready for a hilarious rollercoaster ride with #CHAARI111, now streaming on @PrimeVideoIN! 🕵️♂️💼 Don't miss out on the fun-filled espionage adventure! 🔗 https://t.co/OAcSJasE2u#Vennelakishore @samyukthavv@barkatstudios @aditisoni1111 @tgkeerthikumar pic.twitter.com/BpStl2jB6B — Divo (@divomovies) April 5, 2024 చదవండి: నేషనల్ క్రష్ ఏం చేసినా ట్రోలింగ్.. చేతలతో జవాబు! -
‘చారి 111’ మూవీ రివ్యూ
టైటిల్ : చారి 111 నటీనటులు: వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, సత్య తదితరులు నిర్మాత: అదితి సోనీ దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్ సంగీతం: సైమన్ కె కింగ్ విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చారి 111లో వెన్నెల కిశోర్ హీరో అనగానే..అందరి దృష్టి సినిమాపై పడింది.టీజర్, ట్రైలర్ చూడగానే ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమైపోయింది. సినిమా మొత్తం కామెడీగానే సాగుతుంది. సీరియస్ అంశానికి కామెడీ జోడించి.. హిలేరియస్‌గా సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఎంత కామెడీ సినిమా అయినా... కొంచెం అయినా లాజిక్ ఉండాలి. అది చారి 111లో మిస్ అయింది. సీక్రెట్ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది? పై అధికారులు ఎలా వ్యవహరిస్తారు. ఓ సీఎంతో అధికారి ఎలా మాట్లాడుతాడు? రియాల్టీకి పూర్తి విరుద్ధంగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ అంతా సోసోగా సాగినప్పటికీ..కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ చేసే యాక్షన్ సీన్ ఫస్టాఫ్కి హైలెట్. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే సాగుతుంది. మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ చేసే కామెడి మరింత బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. చారి 111 ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. చారి పాత్రకి వెన్నెల కిశోర్ తగిన న్యాయం చేశాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఎలాంటి కామెడీ ఆశిస్తారో అది ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథన్ ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. తెరపై చాలా గ్లామరస్‌గా కనిపించింది. మేజర్ ప్రసాద్ రావు గా మురళీ శర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య, తాగుబోతు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Chaari 111 First Review: హీరోగా వెన్నెల కిశోర్ హిట్ కొట్టాడా?
కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్గా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘చారి 111’పై హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మరికొద్ది గంటల్లో(మార్చి 1) చారి 111 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి మ్యాజిక్ డైరెక్టర్ సైమన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. సినిమా మొత్తం చూసి..తన ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చేశాడు. `లాక్ అయ్యింది, లోడ్ అయ్యింది, ఫైర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇది కచ్చితంగా అదిరిపోయే వినోదాన్ని పంచే మూవీగా ఆడియెన్స్ ముందుకొస్తుంది. వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా బీజీఎం, మ్యూజిక్ ఉంది`అని సైమన్ ట్వీట్ చేశాడు. #Chaari111 - locked , loaded and ready to fireeee ! Had a blast scoring music for this one !! A sureshot entertainer on its way !!! #Vennelakishore fans Podra BGM uh !! 🔥🔥🔥💥💥💥💯💯💯 — Simon K.King (@simonkking) February 28, 2024 వెన్నెల కిశోర్ హిట్ కొట్టేనా? టాలీవుడ్ కమెడియన్స్ అంతా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కమెడియన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సునీల్ హీరోగా మారి తొలి సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు యావరేజ్‌గా ఆడాయి. కానీ హీరోగా మాత్రం సునీల్ నిలదొక్కుకోలేదనే చెప్పాలి. కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరమై.. మళ్లీ ఇప్పుడు కమెడియన్‌గాను.. విలన్‌గాను రాణిస్తున్నాడు. కమెడియన్ ధన్‌రాజ్ కూడా హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇటీవల వైవా హర్ష, అభినవ్ గోమఠం కూడా హీరో అవతారమెత్తారు. ‘సుందరం మాస్టర్’తో హర్ష, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాతో అభినవ్ గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఈ వారం మరో కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిశోర్ అయినా హీరోగా హిట్ కొడతాడో లేదో చూడాలి. ప్రచార చిత్రాలు అయితే ఆకట్టుకున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉంటే మాత్రం హిట్ పడినట్లే. -
‘చారి 111’ వినోదాన్ని పంచుతాడు: నిర్మాత అదితి సోనీ
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. అదితీ సోనీ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘చారి 111’ నా తొలి సినిమా. వైవిధ్యమైన కథతో తీసిన మంచి వినోదాత్మక చిత్రమిది. వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘‘మళ్ళీ మొదలైంది’ సినిమా తర్వాత నేను చేసిన ద్వితీయ చిత్రం ‘చారి 111’. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్’’ అన్నారు టీజీ కీర్తీకుమార్. ‘‘ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. ఈ పాటని అద్భుతంగా రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘తెలుగులో నాకు తొలి చాన్స్ ఇచ్చిన యూనిట్‌కి థ్యాంక్స్’’ అన్నారు సంయుక్తా విశ్వనాథన్. ‘‘ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సైమన్ కె. కింగ్. -
Chaari 111: గూఢచారిగా 'వెన్నెల' కిశోర్..నవ్వులు పూయిస్తున్న ట్రైలర్
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో 'చారి 111' ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సీరియస్‌గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించనున్నారు. ఈ 'చారి 111' ట్రైలర్ చివరలో 'వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా' అంటూ 'కెజియఫ్'లో రాకీ భాయ్ టైపులో 'వెన్నెల' కిశోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. 'నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు' అంటూ 'వెన్నెల' కిశోర్ మీద పంచ్ కూడా వేశారు. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.