‘చారి 111’ వినోదాన్ని పంచుతాడు: నిర్మాత అదితి సోనీ | 'Chaari 111' Movie Team Press Meet Highlights | Sakshi
Sakshi News home page

Chaari 111: వెన్నెల కిశోర్‌ కామెడీని ఎంజాయ్‌ చేస్తారు : నిర్మాత అదితి సోనీ

Feb 28 2024 11:09 AM | Updated on Feb 28 2024 11:42 AM

Chaari 111 Movie Team press Meet Highlights - Sakshi

‘వెన్నెల’ కిశోర్‌ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్‌ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్‌ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. అదితీ సోనీ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘చారి 111’ నా తొలి సినిమా. వైవిధ్యమైన కథతో తీసిన మంచి వినోదాత్మక చిత్రమిది. వెన్నెల కిశోర్‌ కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు. 

‘‘మళ్ళీ మొదలైంది’ సినిమా తర్వాత నేను చేసిన ద్వితీయ చిత్రం ‘చారి 111’.  ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ జానర్‌ ఫిల్మ్‌’’ అన్నారు టీజీ కీర్తీకుమార్‌. ‘‘ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. ఈ పాటని అద్భుతంగా రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘తెలుగులో నాకు తొలి చాన్స్‌ ఇచ్చిన యూనిట్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు సంయుక్తా విశ్వనాథన్‌.  ‘‘ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సైమన్‌ కె. కింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement