వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న సంయుక్త మీనన్‌ | Samyuktha Menon Becomes Most Happening Heroine With 5 Consecutive superhits | Sakshi
Sakshi News home page

Samyuktha: వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న సంయుక్త మీనన్‌

Published Sat, Jan 6 2024 7:06 PM | Last Updated on Sat, Jan 6 2024 7:16 PM

Samyuktha Menon Becomes Most Happening Heroine With 5 Consecutive superhits - Sakshi

బ్యూటీ విత్ టాలెంట్ అనే గుర్తింపు మలయాళ హీరోయిన్స్ కు ఉంది. వారి లెగసీని టాలీవుడ్ లో కొనసాగిస్తోంది హీరోయిన్ సంయుక్తా మీనన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరోయిన్...ఐదు వరుస సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది.

భీమ్లా నాయక్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ సరసన బింబిసార, ధనుష్ తో కలిసి సార్, సాయి ధరమ్ తేజ్ జోడీగా విరూపాక్ష మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా కల్యాణ్ రామ్ డెవిల్ తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా సంయుక్తా చేసిన ప్రతి సినిమాలోనూ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. 

చేసిన ప్రతి సినిమా సక్సెస్ కావడంతో సంయుక్తా ఉంటే సినిమాకు ఒక పాజిటివ్ వైబ్, క్రేజ్ ఉంటుందనే పేరు టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల్లో వచ్చేసింది. కంటిన్యూగా వస్తున్న సక్సెస్ తో సంయుక్తా మీనన్ కు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి.

ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభులో నాయికగా నటిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ తన ప్రతిభను గుర్తించి అందిస్తున్న అవకాశాలు, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నాయని చెబుతోంది సంయుక్తా మీనన్. మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ తో నటిగా పేరు తెచ్చుకోవాలని ఉందని అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement