భయపెట్టనున్న యాషికా ఆనంద్‌! | Yashika Anand Latest Movie Updates | Sakshi
Sakshi News home page

Yashika Anand: భయపెట్టనున్న యాషికా ఆనంద్‌!

Jan 15 2023 7:53 AM | Updated on Jan 15 2023 7:53 AM

Yashika Anand Latest Movie Updates - Sakshi

తమిళ సినిమా: అందాల నటి యాషికా ఆనంద్‌ భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య కారు యాక్సిడెంట్‌ వల్ల నటనకు కొంత గ్యాప్‌ ఇచ్చారు. గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చైత్ర. యాషికా ఆనంద్‌ దెయ్యంగా నటిస్తున్న ఈ హారర్ర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటుడు అవి తేజ్, శక్తి మహేంద్ర, పూజ, రమణన్, కన్నన్, లూయిస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.మనోహరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను ఎం.జెనిత్‌ కుమార్‌ నిర్వహిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పిజ్జా, డీమాంటీ కాలనీ చిత్రాల తరహాలో విభిన్న కథా, కథనాలతో కూడిన చిత్రంగా చైత్ర ఉంటుందన్నారు. ఇంతకుముందు ఎప్పుడు తెరపై చూడనటువంటి థ్రిల్లర్‌తో కూడిన హారర్ర్‌ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. చిత్రం షూటింగ్‌ పూర్తిగా తిరునల్వేలి జిల్లాలోని కావల్‌ తినరు ప్రాంతంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి  సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. టీకన్నన్‌ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సతీష్‌ కుమార్‌ చాయాగ్రహణను, ప్రభాకరన్‌ మెయ్యప్పన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement