థియేటర్‌లో దెయ్యం!
బెంగళూరు(కర్ణాటక): విచిత్ర శబ్ధాలు, వింత ఆకారాల సంచారం, దెయ్యం తిరుగుతోందనే వదంతులు అక్కడి వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కోలార్ జిల్లా ముళబాగిలు పట్టణంలోని సంగం థియేటర్ కొంతకాలంగా మూతబడి ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా ఈ థియేటర్ నుంచి విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయని, దెయ్యం మాదిరి ఆకారాలు ఆ చుట్టుపక్కల సంచరిస్తున్నాయని స్థానికంగా వదంతులు వ్యాపించాయి.
ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి వందల సంఖ్యలో గ్రామస్తులు ఆ నిర్మాణం వద్ద గుమికూడారు. దెయ్యం ఎలా తిరుగుతోంది..ఎప్పుడు బయటకు వస్తోందంటూ ఆరా తీశారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్‌ఐ భైరా అక్కడకు చేరుకొని ప్రజలతో మాట్లాడారు. ఇది కేవలం వదంతి మాత్రమేనని, దెయ్యం సంచారం అనేది వట్టి పచారమేనని ఎవరూ నమ్మవద్దని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు.