Mulabagilu
-
అక్క బలవంతంతో చెల్లెలి మెడలో కూడా తాళి, కట్ చేస్తే
కోలారు: ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో 7వ తేదీన అక్కా చెల్లెలిని పెళ్లాడిన ఉమాపతిపై ముళబాగిలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పిల్లల రక్షణ కేంద్రం, తహశీల్దార్ సోమవారం గ్రామానికి వెళ్లి విచారించారు. ఒక పెళ్లికూతురు వయసు 16 ఏళ్లేనని తెలిసింది. దీంతో వరుడు ఉమాపతి, అతని తల్లిదండ్రులు దొడ్డలక్ష్మమ్మ, చిక్క చిన్నరాయప్ప, వధువు తల్లిదండ్రులు రాణెమ్మ, నాగరాజప్ప, పెండ్లిపత్రిక ముద్రించిన గాయత్రి ప్రింటర్స్ యజమాని, అర్చకుల పైన సిడిపిఓ ఎం.రమేష్ నంగలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ఎంజి పాలి తెలిపారు. చదవండి: పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. చదవండి: (ఇదో విడ్డూరం: ఇద్దరు భామల ముద్దుల మొగుడు) -
చెట్టుకు ఆటో ఢీ: ముగ్గురు దుర్మరణం
సాక్షి, ముళబాగిలు : ఆటో చెట్టుకు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని ముళబాగిలు తాలూకాలోని గాజులబావి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. డ్రైవర్ ఆటోపై నియంత్రణ కోల్పోవడంతో అది చెట్టును ఢీకొంది. అందులోని ప్రయాణికుల్లో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాయలూరు రోడ్డులోని ఖాద్రిపుర శని మహాత్మ దేవాలయానికి కుటుంబ సమేతంగా ఆటోలో వచ్చి తిరిగి వెళ్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుణ్ణకుప్ప గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్(25), పార్వతమ్మ(28), గౌరమ్మ(30)లు ఘటనా స్థలంలోనే మరణించారు. నారాయణప్ప, శంకరమ్మ, వి.కృష్ణమూర్తి, ఎ.శంకరలు తీవ్రంగా గాయపడ్డారు. శంకరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
థియేటర్లో దెయ్యం!
బెంగళూరు(కర్ణాటక): విచిత్ర శబ్ధాలు, వింత ఆకారాల సంచారం, దెయ్యం తిరుగుతోందనే వదంతులు అక్కడి వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కోలార్ జిల్లా ముళబాగిలు పట్టణంలోని సంగం థియేటర్ కొంతకాలంగా మూతబడి ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా ఈ థియేటర్ నుంచి విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయని, దెయ్యం మాదిరి ఆకారాలు ఆ చుట్టుపక్కల సంచరిస్తున్నాయని స్థానికంగా వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి వందల సంఖ్యలో గ్రామస్తులు ఆ నిర్మాణం వద్ద గుమికూడారు. దెయ్యం ఎలా తిరుగుతోంది..ఎప్పుడు బయటకు వస్తోందంటూ ఆరా తీశారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ భైరా అక్కడకు చేరుకొని ప్రజలతో మాట్లాడారు. ఇది కేవలం వదంతి మాత్రమేనని, దెయ్యం సంచారం అనేది వట్టి పచారమేనని ఎవరూ నమ్మవద్దని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు.