
కోలారు: ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో 7వ తేదీన అక్కా చెల్లెలిని పెళ్లాడిన ఉమాపతిపై ముళబాగిలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పిల్లల రక్షణ కేంద్రం, తహశీల్దార్ సోమవారం గ్రామానికి వెళ్లి విచారించారు. ఒక పెళ్లికూతురు వయసు 16 ఏళ్లేనని తెలిసింది. దీంతో వరుడు ఉమాపతి, అతని తల్లిదండ్రులు దొడ్డలక్ష్మమ్మ, చిక్క చిన్నరాయప్ప, వధువు తల్లిదండ్రులు రాణెమ్మ, నాగరాజప్ప, పెండ్లిపత్రిక ముద్రించిన గాయత్రి ప్రింటర్స్ యజమాని, అర్చకుల పైన సిడిపిఓ ఎం.రమేష్ నంగలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ఎంజి పాలి తెలిపారు.
చదవండి: పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే..
చదవండి: (ఇదో విడ్డూరం: ఇద్దరు భామల ముద్దుల మొగుడు)
Comments
Please login to add a commentAdd a comment