
హీరో కల్యాణ్‌రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే బింబిసారుడు అనే పీరియాడికల్ మూవీలో నటిస్తున్న కల్యాణ్ రామ్ తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశారు. నవీన్ మేడారం దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన డెవిల్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కల్యాణ్‌రామ్ లుక్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
పంచెకట్టులో చేతిలో రివాల్వర్‌తో కల్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. పోస్టర్‌ను బట్టి ఇది 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకొని ఈ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డెవిల్‌తో పాటు మరో మూడు సినిమాలు ప్రస్తుతం కల్యాణ్ రామ్ చేతిలో ఉన్నాయి. ఈసారి హిట్టు కొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కల్యాణ్ రామ్.
Comments
Please login to add a commentAdd a comment