సినిమా థియేటర్‌లో దెయ్యం? | Rumors & Gossip in sangam theater in karanataka | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్‌లో దెయ్యం?

Published Wed, Jul 5 2017 9:32 AM | Last Updated on Sat, Aug 11 2018 8:30 PM

Rumors & Gossip in sangam theater in karanataka

బెంగళూరు :  విచిత్ర శబ్ధాలు, వింత ఆకారాల సంచారంతో  దెయ్యం తిరుగుతోందనే వదంతి నగరవాసులను భీతిల్లేల చేసింది. నగరంలోని రామసముద్రం రోడ్డులోని బండ కాలనీలో సంగం థియేటర్‌ ఉంది. చాలా కాలంగా మూత పడిన ఈ థియేటర్‌ నుంచి విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయని, వింత ఆకారాలు ఆ చుట్టు పక్కల సంచరిస్తున్నాయని ఆ విస్తృతంగా ప్రచారం జరిగింది.

దీంతో  సోమవారం రాత్రి వందల సంఖ్యలో గ్రామస్తులు థియేటర్‌ వద్ద గుమికూడారు. దెయ్యం ఎలా తిరుగుతోంది..ఎప్పుడు బయటకు వస్తోందని పరస్పరం ఆరా తీయడం కనిపించింది. విషయం తెలుసుకున్న టౌన్‌ ఎస్‌ఐ భైరా అక్కడకు చేరుకొని ప్రజలతో మాట్లాడారు. ఇది కేవలం వదంతి మాత్రమేనని, ఎవరూ నమ్మవద్దరిని చెబుతూ అక్కడినుంచి అందరినీ పంపించి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement