Devil Movie: కళ్యాణ్‌ రామ్‌ 'డెవిల్‌' రన్‌టైమ్‌ ఎంతంటే? | Kalyan Ram Upcoming Devil Movie Run Time And Censor Report Details Inside - Sakshi
Sakshi News home page

Devil Movie Censor Report: కళ్యాణ్‌ రామ్‌ 'డెవిల్‌' రన్‌టైమ్‌ ఎంతంటే?

Published Tue, Dec 26 2023 1:56 PM | Last Updated on Tue, Dec 26 2023 3:56 PM

Kalyan Ram Devil Movie Run Time and Latest Update - Sakshi

సినీ లవర్స్.. ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అలాంటి అంచనాలతో ‘డెవిల్’ రానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

రన్‌ టైమ్‌ ఎంతంటే?
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాదిని ‘డెవిల్’తో ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు అద్భుత స్పందన లభించింది. బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు. అలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా డెవిల్ రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.

నెక్స్ట్‌ లెవల్‌..
ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీపడలేదని స్పష్టమవుతోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం వీటన్నింటినీ నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. డెవిల్ సినిమా ఈ నెల 29న తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్‌- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement