దెయ్యాలతో దోస్తీ | srikanth's raa raa to release in june | Sakshi
Sakshi News home page

దెయ్యాలతో దోస్తీ

Published Sun, May 21 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

దెయ్యాలతో దోస్తీ

దెయ్యాలతో దోస్తీ

దెయ్యం అంటే ఎవరైనా ఆమడ దూరం పారిపోతారు. కానీ, వీళ్లు వేరే టైప్‌. దెయ్యాలతో దోస్తీ చేస్తారు. బ్రేక్‌ డ్యాన్సులు కూడా చేస్తారు. అప్పటివరకూ ఎంచక్కా ఆడిపాడిన దెయ్యాలు సడన్‌గా యూ టర్న్‌ తీసుకుని ఎటాక్‌ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాలతో రూపొందుతున్న హర్రర్‌ చిత్రం‘రా..రా’. శ్రీకాంత్, నాజియా జంటగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజయ్‌ నిర్మించారు.

విజి చరిష్‌ దర్శకుడు. రాక్‌ రాక్‌ షకీల్‌ సంగీత దర్శకుడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి చేస్తున్న కామెడీ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి’’ అన్నారు. ‘‘మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఓ టాప్‌ హీరోతో టీజర్‌ రిలీజ్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement