యూరప్‌లో ప్రేమాయణం!
అమలాపాల్ మనసు పారేసుకుంది. ‘వస్తా నీ వెనుక’.. అంటూ ఓ అబ్బాయితో డ్యూయెట్టుకు కూడా రెడీ అయిపోయింది. ఇంతకీ అమలాపాల్ మనసు దోచిన మనోహారుడెవరు?
అమలాపాల్ మనసు పారేసుకుంది. ‘వస్తా నీ వెనుక’.. అంటూ ఓ అబ్బాయితో డ్యూయెట్టుకు కూడా రెడీ అయిపోయింది. ఇంతకీ అమలాపాల్ మనసు దోచిన మనోహారుడెవరు? అనేగా మీ ప్రశ్న. తనెవరో కాదు. నువ్విలా, జీనియస్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన యువ హీరో హవీష్. విషయం ఏంటంటే... వీరిద్దరూ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా పేరు ‘వస్తా నీ వెనుక’. రమేశ్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత. కథకు వెన్నెముకలాంటి పాత్రను ఇష పోషిస్తున్నారు. ప్రేమ, వినోదం సమపాళ్లలో మిళితమైన బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, హవీష్ పాత్ర చిత్రణ, అమలాపాల్ గ్లామర్ చిత్రానికి వెన్నెముకలా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది.
హేమాహేమీలు పని చేస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ తదితర చిత్రాలకు పనిచేసిన విజయ్ కె.చక్రవర్తి ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. ఏప్రిల్ 4 నుంచి యూరప్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. 55 రోజులు అక్కడే షెడ్యూలు చేస్తాం. కీలకమైన టాకీపార్ట్‌తో పాటు ఆరు పాటలనూ అక్కడే చిత్రీకరిస్తాం. స్పెయిన్‌లో రెండు పాటలు, స్విట్జర్లాండ్‌లో మూడు పాటలు, ప్యారిస్‌లో ఒక పాటను చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సుమన్, రావు రమేష్, సుధ, తులసి, హేమ, ప్రవీణ్, అక్షిత, సప్తగిరి, ఇంద్ర, మణేష్, కార్తికేయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన: విస్సు, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: పాత్రికేయ, నిర్మాణం: రామదూత క్రియేషన్స్, కిరణ్ స్టూడియోస్.