రామ్ లీలలు | Havish's 'Ramleela' on Feb 27th | Sakshi
Sakshi News home page

రామ్ లీలలు

Published Fri, Feb 20 2015 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

రామ్ లీలలు

రామ్ లీలలు

అమెరికాలో స్థిరపడిన తెలుగు కుర్రాడు... తెలివైన కుర్రాడు రామ్. జీవితాన్ని హ్యాపీగా, సాఫీగా ఎలా ఉంచుకోవాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం ఎన్ని లీలలైనా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన మలుపులే ఈ ‘రామ్‌లీల’ సినిమా అంటున్నారు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. హవీష్, అభిజిత్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో కోనేరు సత్యనారాయణ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు  మాట్లాడుతూ -‘‘రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. హవీష్‌ను స్టార్‌గా నిలబెట్టే సినిమా అవుతుంది.  అభిజిత్, నందిత పాత్రలు ఈ చిత్రానికి వెన్నుముకగా నిలుస్తాయి. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే విస్సు రాసిన సంభాషణలు పటాసుల్లా పేలతాయి. మా నిర్మాత చాలా పెద్ద సినిమా స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement