మంచి సినిమా తీస్తే... విజయం గ్యారెంటీ : కోనేరు సత్యనారాయణ | If a good movie Success guaranty says koneru satyanarayana | Sakshi
Sakshi News home page

మంచి సినిమా తీస్తే... విజయం గ్యారెంటీ : కోనేరు సత్యనారాయణ

Published Tue, Mar 3 2015 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

మంచి సినిమా తీస్తే... విజయం గ్యారెంటీ : కోనేరు సత్యనారాయణ

మంచి సినిమా తీస్తే... విజయం గ్యారెంటీ : కోనేరు సత్యనారాయణ

‘‘తొలి చిత్రం ‘నువ్విలా’, మలి చిత్రం ‘జీని యస్’తో మంచి నటుడనిపించుకున్న హవీష్ ఈ చిత్రంలో అన్ని రకాల రసాలూ పలికించి, భేష్ అనిపించుకున్నాడు. హవీష్‌కి ఇంకా మంచి సినిమాలు రావాలి’’ అని దర్శకుడు బి. గోపాల్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత కాంబినేషన్‌లో కోనేరు సత్యనారాయణ సమర్పణలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్ లీల’. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.
 
  ఈ వేడుకలో దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘200 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలక్షన్స్‌తో విజయవంతంగా సాగుతోంది. హవీష్ ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతాడని నిరూపించిన చిత్రం ఇది. అభిజిత్, నందితల నటన కూడా ప్రధాన ఆకర్షణైంది’’ అన్నారు. మంచి సినిమా తీస్తే సక్సెస్ చేస్తారని మరోసారి ప్రేక్షకులు నిరూపించారని కోనేరు సత్యనారాయణ అన్నారు. హవీష్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని రామ్ పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడే ఎగ్జయిట్ అయ్యా. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది’’ అన్నారు. శ్రీపురం కిరణ్, విస్సు, లంకాల బుచ్చిరెడ్డి, ‘మల్టీ డైమన్షన్’ వాసు, నందిత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement