‘సెవెన్’ విడుదలపై స్టే | Stay On Havish Seven Movie | Sakshi
Sakshi News home page

‘సెవెన్’ విడుదలపై స్టే

Published Tue, Jun 4 2019 7:15 PM | Last Updated on Tue, Jun 4 2019 7:17 PM

Stay On Havish Seven Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన ‘సెవెన్’ సినిమా విడుదలపై హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఎన్నారై కిరణ్‌ కె.తలశిల పేర్కొన్నారు. అయితే తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని తెలిపారు. ఈ విషయం గురించి ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి  తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement