నేను రెడీ! | Havish Birthday Interview | Sakshi
Sakshi News home page

నేను రెడీ!

Published Sun, Jun 25 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

నేను రెడీ!

నేను రెడీ!

‘‘మాస్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ... ఏ జానర్‌ సినిమా చేయడానికైనా నేను రెడీ. కానీ, ఒక్క కండిషన్‌! కథ బాగుండాలి. పర్టిక్యులర్‌ జానర్‌కు నేను పరిమితం కావాలనుకోవడం లేదు. హీరోగా మంచి సినిమాలు చేయాలనీ, చక్కని పాత్రల్లో నటించాలనీ అనుకుంటున్నా’’ అన్నారు హవీష్‌. ఈ రోజు (ఆదివారం) ఈ యువ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా హవీష్‌ మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు నేను చేసిన మూడు సినిమాల్లో ‘నువ్విలా, జీనియస్‌’ బాగా ఆడాయి. ‘రామ్‌లీలా’ ఆశించినంతగా ఆడలేదు.

 కానీ, అందులో నా క్యారెక్టర్‌ బాగుంటుంది. హీరోగా నా కెరీర్‌ పట్ల, నటన పట్ల హ్యాపీగా ఉన్నాను. డ్యాన్సుల్లో మాత్రం ఇంకొంచెం మెరుగవ్వాలి. ‘రామ్‌లీలా’ తర్వాత ఓ పెద్ద దర్శకుడితో సినిమా అనుకున్నా. కానీ, కుదరలేదు. ఈలోపు పలు కథలు విన్నాను. ఏవీ నచ్చలేదు. ఓ మంచి కథ కోసం ఎదురు చూడడంతో కొంచెం గ్యాప్‌ వచ్చింది. ఈ బుధవారం నేను హీరోగా నటించబోయే నాలుగో సినిమా ప్రారంభమవుతుంది.

 ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు. జక్కం జవహర్‌బాబు, రమేశ్‌వర్మ (దర్శకుడు– ‘రైడ్‌’ ఫేమ్‌) ఈ చిత్రానికి నిర్మాతలు. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా ద్వారా సాయిశ్రీరామ్‌ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. దీని తర్వాత జక్కం జవహర్‌బాబుగారి నిర్మాణంలో మరో సినిమా చేయనున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement