అందుకే ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తాను : రవితేజ | RaviTeja Talks About Dhamaka Movie Press Meet | Sakshi
Sakshi News home page

అందుకే ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తాను : రవితేజ

Published Fri, Dec 23 2022 12:59 AM | Last Updated on Fri, Dec 23 2022 8:18 AM

RaviTeja Talks About Dhamaka Movie Press Meet - Sakshi

‘‘కొంతమంది లైఫ్‌లో బోర్‌ కొడుతుందని అంటుంటారు. కానీ ‘బోర్‌’ అనే వర్డ్‌ నా డిక్షనరీలోనే లేదు. షూటింగ్‌ అంటే నాకు పండగ. జీవితంలోని ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్‌ చేస్తాను. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, నెగిటివిటీ వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. త్వరగా ముసలివాళ్లం కూడా అయిపోతున్నాం. అందుకే వాటి తాలూకు ఆలోచనలను మనసుల్లో నుంచి తీసేస్తే హ్యాపీగా ఉంటాం’’అని హీరో రవితేజ అన్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో రవితేజ చెప్పిన విశేషాలు.


► ‘ధమాకా’ గురించి క్లుప్తంగా...
‘రాజా ది గ్రేట్‌’ తర్వాత నేను చేసిన అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది.
నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌.

► చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ సినిమాతో కొందరు ‘ధమాకా’కు పోలిక పెడుతున్నారు...
మా రైటర్‌ ప్రసన్నకుమార్‌ బెజవాడ ఈ మాట అన్నారు. తెలుగులో మంచి ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలు చిరంజీవిగారితోనే మొదలయ్యాయి. మేం ఫాలో అవుతున్నాం. ‘ధమాకా’ కూడా ‘రౌడీ అల్లుడు’లాంటి ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మే.

► త్రినాథరావుతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌...
త్రినాథరావుతో పని చేయడం సరదాగా ఉంటుంది. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ ఎక్కువగా మాట్లాడడు కానీ ఈ సినిమాకు అతని మ్యూజిక్‌ సౌండ్‌ అదిరిపోయింది. బెజవాడ ప్రసన్నకుమార్‌ డైలాగ్స్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తారు. అదే విధంగా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ పాజిటివ్‌ పీపుల్‌. ఇలాంటి వారికి సక్సెస్‌ వస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది.

► రీసెంట్‌గా జరిగిన మీ ఫ్యాన్స్‌ మీట్‌ విశేషాలు..
అభిమానులను కలవడం అనేది నాకే కాదు..అందరి హీరోలకూ జరుగుతుంటుంది. ఆ మూమెంట్స్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. ఈ పాజిటివ్‌నెస్‌ ముందుకు నడిపిస్తుంటుంది.

► రవితేజ అంటే ఎంటర్‌టైన్మెంట్‌. కానీ ఇటీవల సీరియస్‌ సినిమాలు కూడా చేశారు కదా..  
యాక్టర్‌గా డిఫరెంట్‌ జానర్‌ సినిమాలను ప్రయత్నించాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నాలను ఆపకూడదు.

► ఇటీవల కొత్త రచయితలు, దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తున్నట్లున్నారు...
ఎప్పట్నుంచో కొత్త రచయితలు, దర్శకులతో చేస్తున్నాను. వారితో పని చేయడం ఇష్టం. ఎందుకంటే కొత్తవారిలో నిరూపించుకోవాలనే కసి, తపన, ఉత్సుకత ఉంటాయి. ఒకప్పుడు నేనూ కొత్తవాడిలా వచ్చినవాడినే. అలాగే ఒకసారి కథ లాకయ్యాక నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉండదు. ఓన్లీ ఇంప్రొవైజేషన్సే.

► కరోనా తర్వాత సినిమాల పట్ల ప్రేక్షకుల ధోరణి మారిపోయినట్లు అనిపిస్తోంది...
కొంత ప్రభావం అయితే ఉండొచ్చు. కానీ పూర్తిగా కాదు. కరోనా తర్వాత సోషల్‌ డ్రామా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పటికిప్పుడు కొత్త కథలేం పుట్టవు. కానీ కథను ఎంత కొత్తగా చూపిస్తున్నామనే దాన్నిబట్టే సినిమాలు ఆడతాయి. నా ప్రతి సిని మాను నేను ఒకేలా ట్రీట్‌ చేస్తాను. అయితే ఒకసారి ఆడియన్స్‌ కనెక్ట్‌ అయితే, మరోసారి కనెక్ట్‌ కారు.

► ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకులనూ ప్రోత్సహిస్తున్నారు...
ఓ మనిషి టాలెంట్‌ ఒక ఫ్లాప్‌ను బట్టి తగ్గిపోయి, ఓ హిట్‌ని బట్టి పెరిగిపోయి.. ఆ లెక్క కరెక్ట్‌ కాదు. నా లెక్క కూడా ఇది కాదు. ఓ దర్శకుడు ఓసారి అనుకున్నది క్లిక్‌ అవుతుంది మరోసారి కాదు. సినిమా సక్సెస్‌ అవ్వలేదు కదా అని దర్శకుడి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్‌ కాదు. హిట్స్‌ ఉన్నట్లే ఫ్లాప్‌లూ ఉంటాయి. ఇది ప్రతి డిపార్ట్‌మెంట్‌కు వర్తిస్తుంది.

► కథల ఎంపికలో మీ ధోరణి ఎలా ఉంటుంది?
ఇదివరకు చాలా స్పీడ్‌గా ఉండేవాడిని. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను. కథ నచ్చకపోతే సినిమా చేయను. డైరెక్టర్‌ కోసం, కాంబినేషన్‌ కోసం నేను సినిమాలు చేయను.

► పెరిగిపోతున్న ఓటీటీ కల్చర్‌ గురించి...
ఓటీటీ కంటెంట్‌ వేరు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే కంటెంట్‌ వేరు. ఓటీటీలో సూపర్‌ కంటెంట్, పెర్ఫార్మెన్సెస్‌ను చూశాను. కానీ నేను దానికి ప్రభావితం కాలేదు. అక్కడ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ చేయను.

► హీరోగా మీ అబ్బాయి లాంచ్‌ ఎప్పుడు?
మా అబ్బాయి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆలోచన లేదు. ఇంకా చాలా టైమ్‌ ఉంది.

► చాలా గ్యాప్‌ తర్వాత చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు...
చిరంజీవిగారంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ కథ, నా పాత్ర నచ్చాయి. ఈ సినిమా చేయడానికి దర్శకుడు బాబీ కూడా ఓ కారణం కావొచ్చు. ఇక చిరంజీవిగారితో సినిమా చేయడం కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్సే.

► పాన్‌ ఇండియా గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.. మీ అభిప్రాయం..
ప్రతి సినిమా పాన్‌ ఇండియా అవ్వదు. కథ కుదరాలి. నేను పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చేస్తున్నాను. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను.  

► మెడిటేషన్‌లాంటివి చేస్తుంటారా?
నేనెప్పుడూ మెడిటేషన్‌ లోనే ఉంటాను. నాకు సినిమాలు తప్ప ఏమీ తెలియదు. దేన్నీ సీరియస్‌గా తీసుకోను. జీవితంలో రిగ్రెట్స్‌ లేవు. స్టార్‌ అనే ప్రెజర్‌ను తీసుకోను. భవిష్యత్‌ గురించి ప్లాన్‌ చేయను. ఓ ఫ్లోలో వెళ్లిపోతుంటాను.

► మీ తర్వాతి చిత్రాలు...
‘రావణాసుర’ షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. ‘ఈగిల్‌’ సినిమా గురించి ఇప్పుడేం చెప్పలేను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement