Ravi Teja Emotional Tweet Over Dhamaka Success - Sakshi
Sakshi News home page

Ravi Teja: 2022 చాలా కష్టంగా గడిచింది..రవితేజ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sun, Jan 1 2023 2:28 PM | Last Updated on Sun, Jan 1 2023 3:22 PM

Ravi Teja Emotional Tweet On Dhamaka Success - Sakshi

చాలా కాలం తర్వాత ‘ధమాకా’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు మాస్‌ మహారాజా రవితేజ. డిసెంబర్‌ 23న విడుదలైన ఈ చిత్రం..ఇప్పటికీ భారీ కలెక్షన్స్‌ని రాబడుతూ.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ధమాకా విజయంపై తాజాగా రవితేజ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

‘ధమాకా’లాంటి మర్చిపోలేని సినిమాతో 2022కు వీడ్కోలు చెబుతున్నాం. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు థ్యాంక్స్‌.  ఈ సక్సెస్ ను గతేడాదిలో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నాను. ఈ ఏడాది ఎంతో కష్టంగా గడిచింది. కానీ మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు సాగేలా చేసింది. 2023లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’అని రవితేజ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement