వంద కోట్లకు చేరువలో ధమాకా, మేకింగ్‌ వీడియో రిలీజ్‌! | Dhamaka 10 Days Collections and Making Video | Sakshi
Sakshi News home page

Dhamaka: ధమాకా పది రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Published Mon, Jan 2 2023 1:18 PM | Last Updated on Mon, Jan 2 2023 1:32 PM

Dhamaka 10 Days Collections and Making Video - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ నటించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ధమాకా థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతోంది. కేవలం 9 రోజుల్లోనే రూ.77 కోట్లు రాబట్టిన ఈ సినిమా కొత్త ఏడాది మొదటి రోజును బాగా క్యాష్‌ చేసుకుంది. పదవ రోజు ఏకంగా రూ.12 కోట్లపై చిలుకు వసూళ్లు సాధించింది. దీంతో ధమాకా కలెక్షన్లు రూ.89 కోట్లకు చేరాయి. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం.

ఇకపోతే తాజాగా చిత్రయూనిట్‌ ధమాకా మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇందులో షూటింగ్‌ అంతా ఎంత సరదాగా సాగిపోయిందో చూపించారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ సినిమా అదిరిపోయిందని, ధమాకా రూ.100 కోట్ల క్లబ్బులో ఎప్పుడు చేరుతుందా? అని వెయిట్‌ చేస్తున్నామంటున్నారు. కాగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్‌ శ్రీలీల తన అందంతో, డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టింది.

చదవండి: ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. ఈవెంట్‌లో నటుడికి గాయం
చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి స్పెషల్‌ పోస్టర్లు చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement