Pelli Sandadi Actress Sreeleela Sell Dhamaka Movie Tickets In Theatre - Sakshi
Sakshi News home page

Sreeleela: థియేటర్​లో టికెట్లు అమ్మిన పెళ్లిసందడి ఫేమ్​.. ఫోటోలు వైరల్

Dec 17 2022 6:14 PM | Updated on Dec 17 2022 7:29 PM

PelliSandhadi Actress Sreeleela Sales Dhamaka Movie Tickets In Theatre - Sakshi

పెళ్లిసందడి ఫేమ్, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చేసిన పని వైరల్‌గా మారింది. తాజాగా మాస్ మహారాజా రవితేజతో కలిసి 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ముద్దు గుమ్మ. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ మొదలయ్యాయి. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్‌లోని ఓ థియేటర్​లో టికెట్లు అమ్మి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో శ్రీలీల చూసిన అక్కడి యూత్ ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.

రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్​లోని ఏఎంబీ మాల్​లో కాసేపు సందడి చేసింది. అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఏకంగా టికెట్‌ కౌంటర్‌లో కూర్చుని హీరోయిన్ టికెట్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా క్యూ కట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement