Dhamaka Movie: 'Pulsar Bike' Song Teaser Out Now! - Sakshi
Sakshi News home page

Dhamaka : ‘పల్సర్‌బైక్‌’ పాటకి రవితేజ, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు

Published Tue, Jan 3 2023 5:12 PM | Last Updated on Tue, Jan 3 2023 6:06 PM

Pulsar Bike Song Teaser Out From Dhamaka Movie - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. ఇప్పటికే డిసెంబర్‌ 23న విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పటికే రూ.94 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. వంద కోట్ల క్లబ్‌లో చేరడానికి రెడీ అవుతోంది.  రవితేజ ఎనర్జీ, యాక్షన్‌ ఎలిమెంట్స్‌.. శ్రీలీల గ్లామర్‌, డ్యాన్స్‌ కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

ముఖ్యంగా ఓ సన్నివేశంలో రవితేజ, శ్రీలీల కలిసి ప్రైవేట్‌ ఆల్బమ్‌ ‘పల్సర్‌ బైక్‌’ పాటకి వేసే స్టెప్పులు థియేటర్స్‌లో ఈళలు వేయిస్తోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన టీజర్‌ని చిత్రబృందం రిలీజ్‌ చేసింది. అందులో రవితేజ, శ్రీలీల వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా, రవితేజ డబల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై  టీజీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement