Sreeleela Speech About Hero Ravi Teja, Dhamaka Movie - Sakshi
Sakshi News home page

రవితేజతో మాట్లాడడానికి చాలా టెన్షన్‌ పడ్డా: శ్రీలీల

Published Wed, Dec 21 2022 4:55 PM | Last Updated on Wed, Dec 21 2022 6:00 PM

Sreeleela Talk About Ravi Teja Dhamaka Movie - Sakshi

‘రెండో సినిమానే రవితేజ లాంటి స్టార్‌ హీరోతో నటించే అవకాశం రావడంతో మొదట్లో  టెన్షన్‌ పడ్డా. రవితేజతో మాట్లాడడానికి ఇబ్బంది పడేదాన్ని. కానీ ఆయన నన్ను చాలా మోటివేట్‌ చేశారు.సెట్‌లో చాలా సపోర్ట్‌ చేశారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్‌ ఉంటుంది’అని అన్నారు శ్రీలీల. మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవ ఈ డిసెంబర్‌ 23న విడుదలతుంది. ఈ సందర్భంగా శ్రీలీల మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. 

దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు తన గత చిత్రం 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు.  అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. పెళ్లి సందడి విడుదల కాకముందే 'ధమాకా' కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రం మంచి ఎంటర్ టైనర్. చాలా హిలేరియస్ గా ఉంటుంది. నాకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చాలా ఇష్టం. 

తక్కువ సమయంలోనే రవితేజ గారితో పని చేసే అవకాశం రావడం చాలా లక్కీగా ఉంది. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను.  'విక్రమార్కుడు' డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు. 

దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన గత చిత్రాలన్ని చూశా. ‘నేను లోకల్’ పాటలు బెంగళూర్ లో ఉనప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా ఉంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్.

ఈ చిత్రంలో  ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబల్ రోల్ తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా ఉంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్. 

ధమాకా టీమ్‌తో నాకు చాలా  స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. స్పెయిన్ లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు నా కాస్ట్యుమ్ బ్యాగ్ పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఐతే మేము ఉండే లొకేషన్ నుంచి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ వేరేవేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుంచి ఫోటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా  ఆప్యాయంగా చూసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. 'మన అమ్మాయి' అనే వైబ్ ఇచ్చారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ధమాకా విడుదల కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను. అదే సమయంలో లోపల చిన్న నెర్వస్ నెస్ కూడా ఉంది(నవ్వుతూ)

నేను బేసిగ్గా స్విచాన్ స్విచాప్ పర్సన్ ని. యాక్టర్ అన్నప్పుడు అందరి దృష్టి నాపై ఉంటుంది.  మెడిసిన్ చదువు విషయానికి వస్తే .. అక్కడ మనల్ని మనలానే వదిలేస్తారు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇష్టం. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో చదువుకుంటాను. 

కొత్త సినిమాల విషయానికొస్తే.. బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి సినిమా ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  అలాగే బోయపాటి-రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.  ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఆయా నిర్మాణ సంస్థలు వెల్లడిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement