రవితేజ పెద్ద మాస్‌ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను: రాఘవేంద్రరావు | K Raghavendra Rao Speech at Dhamaka Pre Release Event | Sakshi
Sakshi News home page

రవితేజ పెద్ద మాస్‌ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను: రాఘవేంద్రరావు

Published Mon, Dec 19 2022 1:20 AM | Last Updated on Mon, Dec 19 2022 10:49 AM

K Raghavendra Rao Speech at Dhamaka Pre Release Event - Sakshi

భీమ్స్, టీజీ విశ్వప్రసాద్, త్రినాథరావు, శ్రీలీల, కె. రాఘవేంద్ర రావు, రవితేజ, వివేక్‌ కూచిభొట్ల 

‘‘నేను దర్శకత్వం వహించిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలోని ఆర్కెస్ట్రా గ్రూపులో రవితేజ ఒకడు. ఆ టీమ్‌లో రవితేజ డ్రమ్స్‌ వాయించాడు. తను భవిష్యత్‌లో పెద్ద మాస్‌ హీరో అవుతాడని అప్పుడే ఊహించాను. ఇక ‘పెళ్ళి సందడి’(2021) సినిమాలో ఫ్లూటు వాయించి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు శ్రీలీల. వీరిద్దరితో ‘ధమాకా’కి కనకవర్షం కురవాలి’’ అని డైరెక్టర్‌ కె.రాఘవేంద్ర రావు అన్నారు.

రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమా పెద్ద హిట్‌ కావాలి. త్వరలో రవితేజ కొడుకు కూడా హీరో కాబోతున్నాడు’’ అన్నారు.



రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విజయంపై టీమ్‌ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం. త్రినాథరావు, రైటర్‌ ప్రసన్న, శ్రీలీల, భీమ్స్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళతారు. విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల మంచి పాజిటివ్‌ నిర్మాతలు. ఏ విషయంలోనూ రాజీపడని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌’’ అన్నారు. ‘‘నేనూ రవితేజగారి అభిమానినే. ‘ధమాకా’ సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు త్రినాథరావు నక్కిన.



‘‘సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ అవ్వడానికి ఉన్న ప్రతి మెట్టు ఎక్కి వచ్చిన హీరో ఒక్క రవితేజగారే’’ అన్నారు రైటర్‌ ప్రసన్న కుమార్‌. ‘‘భీమ్స్‌ అవుట్‌డేట్‌ అయిపోయాడని చాలామంది అనుకున్నారు. ‘ధమాకా’ తో నన్ను మళ్లీ నిలబెట్టిన రవితేజగారికి థ్యాంక్స్‌’’ అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో. ‘‘ధమాకా’ పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, వివేక్‌ కూచిభొట్ల. ‘‘ధమాకా’కు ప్రేక్షకులు అద్భుత విజయం చేకూర్చాలి’’ అన్నారు శ్రీలీల.



ఈ వేడుకలో డైరెక్టర్స్‌ నందినీ రెడ్డి, బీవీఎస్‌ రవి, మారుతి, శ్రీవాస్, సుధీర్‌ వర్మ, కృష్ణచైతన్య, వంశీ, వై.విజయ్, విజయ్‌ కనకమేడల, దర్శక–నటులు శ్రీనివాస్‌ అవసరాల, సముద్రఖని, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్, ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement